About Varadhi Donors Club

నమస్కారం

నూకల సూర్య ప్రకాష్ M.Sc, B.Ed, (B.L)

ఫౌండర్ ట్రస్టీ & చైర్మన్

ఆరోగ్య భారత్ ట్రస్ట్

'వారధి డోనర్స్ క్లబ్ ' ఆరోగ్య భారత్ ట్రస్ట్ చేత ప్రారంభించ బడింది.
ఆరోగ్య భారత్ ట్రస్ట్ The Indian Trusts Act 1882 ప్రకారం 04th AUGUST 2016 న Bk - 4, CS No: 189/2016 & doct No: 182/2016 Visakhapatnam (RO)
నందు రిజిస్టర్ కాబడినది. ట్రస్ట్ నిర్వహించే వివిధ సేవా కార్యక్రమాలలో భాగంగా స్వచ్ఛంద సేవా సంస్థలకు, స్వచ్ఛంద సేవకులకు ఆర్ధిక వనరులు సమకూర్చటం కోసం ఈ 'వారధి డోనర్స్ క్లబ్ ' ను ప్రారంభించడం జరిగింది.
ఈ వారధి డోనర్స్ క్లబ్ సేవలు అన్నీ పూర్తిగా ఉచితం. విస్తృత స్ధాయిలో సేవ చేయడం కోసం www.varadhidonorsclub.org అనే వెబ్ సైట్ ను రూపొందించింది.
ఈ వెబ్ సైట్ ఆధారంగా Varadhi Donors Club మొబైల్ ఆప్ ను సభ్యుల సౌకర్యం కోసం అందుబాటులోకి తెచ్చింది.
వారధి డోనర్స్ క్లబ్ లో సాధారణసభ్యులు కావడానికి అర్హతలు:

1) భారతీయ పౌరులు ఎవరైనా వారధి డోనర్స్ క్లబ్ లో సభ్యులు గా చేరవచ్చు.
2) 18 సంవత్సరాల వయసు నిండిన స్త్రీ, పురుషులు ఎవరైనా వారధి డోనర్స్ క్లబ్ లో సభ్యులు కావచ్చు.
3) వారధి డోనర్స్ క్లబ్ లో సభ్యులు గా చేరడానికి ఏవిధమైన సభ్యత్వ రుసుములు లేవు. ఇది పూర్తిగా ఉచిత సేవ.
4) వారధి డోనర్స్ క్లబ్ లో సాధారణ సభ్యులు గా నమోదు చేసుకున్నవారు వారధి డొనేషన్ ప్రోగ్రామ్ లో తప్పకుండా విరాళం ఇవ్వాలని నియమం లేదు.
5) వారధి డోనర్స్ క్లబ్ లో సభ్యులు వారి ఇష్ట ప్రకారమే డొనేషన్ లు ఇవ్వవచ్చు. ఇందులో ఏవిధమైన నిర్భందాలు లేవు.
వారధి డోనర్స్ క్లబ్ కార్యక్రమాలు ఏమిటి?

' సేవ ' చేయడమే కాదు, సేవ చేసే వారికి సహకరించడం, ప్రోత్సహించడం కూడా 'ఉత్తమ సేవ' అవుతుంది.
తాము బ్రతుకుతూ మిగిలినవి బ్రతకడానికి సహకరించడం ఉత్తమ జీవుల లక్షణం. మొక్కలు బ్రతుకుతూ ప్రపంచానికి ప్రాణ వాయువును ఇస్తున్నాయి. అలాగే వాటి ఆహారం అవి తయారు చేసుకుంటూ, జీవులకు ఆహారాన్ని ఇస్తున్నాయి. మరి ఆది మానవుడు నుండి మహోన్నతుడుగా ఎదిగిన మనిషి , తాను బ్రతుకుతూ ఏమిస్తున్నాడు? మనిషి లో ఈ ఆలోచన నుండి ఉద్భవించినదే ' సేవా భావన'.
సేవానిరతి, సమయం, సేవ చేసే శక్తి ఉన్నవారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే! దాతృత్వంతో సంపద ఉన్నవారు ధనసహాయం విరాళాల రూపంలో అందించినప్పుడే స్వచ్ఛంద సేవకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు దీనులను, అవసరాలలో ఉన్నవారిని ఆదుకుని వారికి సేవ చేయడం ద్వారా ప్రకృతిని, సమాజాన్ని పరిరక్షించి, ధర్మరక్షణ చేయగలుగుతారు.
సేవ ఒక గొప్ప కార్యం అయితే! సేవ చేసే వ్యక్తులకు, సంస్థలకు సహకరించడం, ప్రోత్సహించడం ఇంకా గొప్ప కార్యక్రమం అవుతుంది. ప్రోత్సాహం, సహకారం లేకపోతే ఎవరూ ఏ కార్యక్రమం చేయలేరు. కాబట్టి స్వచ్ఛంద సేవా సంస్థలకు (NGO'S) స్వచ్ఛంద సేవకులకు (వాలంటీర్లు) ప్రోత్సాహం, సహకారం అందజేయడం కోసం ' వారధి డోనర్స్ క్లబ్'(VARADHI DONORS CLUB) ను ప్రారంభించడం జరిగింది.
వారధి డోనర్స్ క్లబ్ ఏం చేస్తుంది?

దాతృత్వం కల దాతలను(Donors) సభ్యులు గా చేర్చుకుని వారి ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు మరియు సమాజ సేవకులకు(Volunteers) విరాళాలు నిరంతరాయంగా ఒక క్రమపద్ధతిలో ఇచ్చేటట్లు *వారధి డోనర్స్ క్లబ్ (Varadhi Donors Club) పనిచేస్తోంది. ఈ వారధి డోనర్స్ క్లబ్ (Varadhi Donors Club) సభ్యత్వం పూర్తిగా ఉచితం. ఏవిధమైన రుసుము లేదు.

సభ్యులుగా ఎలా చేరాలి


Step 1:


ఇందులో ఇచ్చిన మెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీ వివరాలు నింపి సబ్-మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్నవారు వెంటనే వారధి డోనర్స్ క్లబ్ (Varadhi Donors Club) లో సాధారణ సభ్యులు అవుతారు. సభ్యులు ఏం చేయాలి? సభ్యులు వారి మొబైల్ నెంబర్, వారు ఎంటర్ చేసుకున్న పాస్ వర్డ్ ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన డోనర్ మెంబర్ తన డొనేషన్ కార్యక్రమాన్ని క్రింది విధంగా చేయాలి.

Step 2:


డోనర్ మెంబర్ లాగిన్ అయిన తరువాత డోనర్స్ డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది.
1) డోనర్ డాష్ బోర్డు లో క్లిక్ టు డొనేషన్ NGO అనే బాక్స్ ను క్లిక్ చేయాలి. అప్పుడు NGO'S లిస్టు ఓపెన్ అవుతుంది.
2)స్వచ్ఛంద సేవా సంస్థల(NGO'S) లిస్టు లో ఏదైనా ఒక సంస్థను ఎంపిక చేసుకుని ఆ సంస్థ క్రింద ఉన్న వ్యూ డీటైల్స్ ను క్లిక్ చేయాలి.
3) అప్పుడు ఆ సంస్థ యొక్క పూర్తి వివరములు, వాటి కార్యక్రమాలు, అడ్రస్, బ్యాంక్ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.
4) మీరు ఎంపిక చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ బ్యాంక్ అకౌంట్/G.Pay/ Phone pe మొదలైన వివరాలు నోట్ చేసుకుని వారధి డోనర్స్ క్లబ్ ఆప్ ( Varadhi Donors Club app) నుండి బయటకు వచ్చి, మీకు అవకాశం ఉన్న పద్ధతిలో ఆ సంస్థ అకౌంట్ కు రూ. 600/-(ఆరు వందలు) విరాళం పంపాలి.
5) విరాళం పంపిన తరువాత తిరిగి వారధి డోనర్స్ క్లబ్ (Varadhi Donors Club) ఆప్ ను ఓపెన్ చేసి అప్ డేట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటైల్స్ అనే బాక్స్ లో వివరాలు నింపి తదుపరి సబ్ మిట్ ట్రాన్సాక్షన్ డీటైల్స్ అనే బాక్స్ ను క్లిక్ చేయాలి.
6) అప్పుడు మీరు స్వచ్ఛంద సేవా సంస్థ (NGO) కు ఇచ్చిన డొనేషన్ వివరాలు వారధి డోనర్స్ క్లబ్ (Varadhi Donors Club)కు చేరతాయి. దీంతో step 2, స్వచ్ఛంద సేవా సంస్థ లకు ఇచ్చే విరాళం పూర్తి అవుతుంది.

Step 3


1)డోనర్స్ డాష్ బోర్డు లో క్లిక్ టు వాలంటీర్స్ అనే బాక్స్ ను క్లిక్ చేసినట్లయితే స్వచ్ఛంద సేవకుల లిస్టు ఓపెన్ అవుతుంది.
2) ఆ వాలంటీర్స్ లిస్ట్ లో ఉన్న వాలంటీర్ యొక్క వ్యూ డీటైల్స్ ను క్లిక్ చేసినట్లయితే వారి యొక్క వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు, వారు చేసే సేవా కార్యక్రమాల వివరాలు కనిపిస్తాయి.
3) స్వచ్ఛంద సేవకులలో 5గురి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు నోట్ చేసుకుని ఈ వారధి డోనర్స్ క్లబ్ ఆప్ (Varadhi Donors Club app) నుండి బయటకు వచ్చి మీకు అవకాశం ఉన్న పద్ధతిలో ఒక్కొక్కరికి రూ.100/- (వంద రూపాయలు) చొప్పున విరాళాలు వారి అకౌంట్ లకు పంపాలి.
4) ఇలా 5 గురు వాలంటీర్స్ కు విరాళం పంపిన తరువాత తిరిగి వారధి డోనర్స్ క్లబ్ ఆప్ (Varadhi Donors Club app) ను ఓపెన్ చేసి అప్ డేట్ 5 పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటైల్స్ లో ఎవరికైతే డొనేషన్ పంపారో వారి ID నెంబర్, పేమెంట్ ట్రాన్సాక్షన్ నెంబర్, ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్స్ నింపి సబ్ మిట్ 5 ట్రాన్సాక్షన్ డీటైల్స్ బాక్స్ ను క్లిక్ చేయాలి.
5) అప్పుడు మీరు 5 గురు వాలంటీర్స్ కు పంపిన విరాళాల వివరాలు వారధి డోనర్స్ క్లబ్ (Varadhi Donors Club) కు చేరుతాయి. దీనితో విరాళాలు ఇచ్చే కార్యక్రమం పూర్తవుతుంది .

Step 4:


విరాళాలు ఇవ్వడం కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల క్రిందకే వస్తాయి. కాబట్టి మీరు కూడా స్వచ్ఛంద సేవకులుగా ( వారధి వాలంటీర్లుగా ) వారధి డోనర్స్ క్లబ్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందు కోసం క్లిక్ హియర్ టు సెండ్ రిక్వెస్ట్ టు బికమ్ వాలంటీర్ అనే బాక్స్ ను క్లిక్ చేయాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్ డేట్ అయ్యాయో, లేదో మై ప్రొఫైల్ లో చెక్ చేసుకోవాలి. ఒక వేళ మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు లేకపోతే ఆ వివరాలు అప్ డేట్ చేయాలి. మీరు పంపిన వాలంటీర్ రిక్వెస్ట్ వారధి డోనర్స్ క్లబ్ (Varadhi Donors Club) కు చేరిన తర్వాత మీ డొనేషన్ వివరాలు, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిచూసి మీ వాలంటీర్ రిక్వెస్ట్ అప్రూవ్ చేయబడుతుంది. అప్పటి నుంచి మీ వివరాలు కూడా స్వచ్ఛంద సేవకుల లిస్టు లో సిస్టమ్ ప్రైయార్టీ ప్రకారం తరువాత డొనేషన్ లు ఇచ్చే వారికి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా వారధి డోనర్స్ క్లబ్ లో వాలంటీర్ అయిన దగ్గర నుండి 6 నెలలు పాటు లిస్ట్ లో కొనసాగించబడును. 6 నెలలు పూర్తి కాగానే తిరిగి విరాళం ఇచ్చినట్లు అయితే వాలంటీర్స్ లో వారి పేరు కొనసాగును. ఈ విధంగా డొనేషన్ లు ఇచ్చే, పుచ్చుకొనే ఒక స్వచ్ఛంద విరాళ కార్యక్రమాన్ని వారధి డోనర్స్ క్లబ్ (Varadhi Donors Club) వినూత్నంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల అభివృద్ధి కొరకు ప్రారంభించింది. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము.
Note: ఏమైనా సందేహాలు ఉంటే contact us లోని మెయిల్ లేదా ఫోన్ నెంబర్ కు సంప్రదించండి.

For more Queries please contact us: +91 8522 825 622

Privacy Policy